PM Modi: ఢిల్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార ఆప్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌తో ఢిల్లీ పోరు త్రిముఖ పోటీగా మారింది. ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం ఆప్‌ని, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. తాజాగా, ఢిల్లీలోని బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ‘‘మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్’’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ…
Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. రూ. 382 కోట్ల విలువైన హెల్త్ కుంభకోణంలో కేజ్రీవాల్‌కి సంబంధం ఉందని ఆరోపించింది. ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ బుధవారం మాట్లాడుతూ.. కాగ్ నివేదిక కేజ్రీవాల్ నిర్వహించిన ఆరోగ్య సంబంధిత కుంభకోణాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అవినీతిపై పోరాడుతానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆయనే అవితీని చేసినట్లు కాగ్ వెల్లడించిందని అన్నారు.
కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
కమలం పార్టీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.
Manish Sisodia: దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష పార్టీలైన ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దని ఆప్ సినీయర్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు.
Atishi Marlena: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని బీజేపీ పార్టీకి సంబంధించిన గూండాలే చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయని.. ఈ దాడి బాధ్యులుగా రోహిత్ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తుల…
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.
Ayushman Bharat Scheme: ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎంవోయూపై సర్కార్ సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.