రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ విత్తనాలే అన్నారు సోము వీర్రాజు. విశాఖ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ చారిత్రాత్మకమైన పార్టీ. ఏపీలోనూ బలమైన శక్తిగా ఎదుగుతాం అన్నారు.దేశ రాజకీయాలలో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించింది. జాతీయ భావాలతో పనిచేస్తాం. బీజేపీ ఈదేశానికి చారిత్రక అవసరం అన్నారు సోము వీర్రాజు.
రేపటి నుండి ఈనెల 20 వరకు రాష్ట్రం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసాం. మా పొత్తు వ౦ద కోట్ల మ౦ది ప్రజలు, జనసేన తోనే. ఏ మార్పులు జరిగినా అది బీజేపీ వలనే సాధ్యం అవుతుందన్నారు సోము వీర్రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలనేది ఏపీ బీజేపీ నిర్ణయం. మైన్స్ పాలసీ దేశవ్యాప్తంగా మారుతుంది. పెట్రోల్, డీజిల్ పై మేము పది రూపాయలు తగ్గించాం అన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదన్నారు సోము వీర్రాజు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శోభాయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు.