టెస్టు క్రికెట్ లో సుమారు నాలుగేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి సెంచరీల బాట పట్టాడు. 2019లో బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో సెంచరీ తర్వాత అతడు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
ఒకానొక టైంలో విరాట్ కోహ్లీని టీమ్ నుంచి తీసేటమే మంచిది అనే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్టులలో విఫలమైన కోహ్లీ.. ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ(186 ) సెంచరీ చేశాడు. కాగా అహ్మదాబాద్ లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ, హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఉప్పుడు క్రీజులోకి వచ్చినా అందరూ తాను సెంచరీ కొట్టాని ఆశిస్తారని, ఆ అంచనాలతో తాను ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చాడు.
Also Read : Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
అంచనాల బరువును మోయడం కఠినంగా అనిపించిందని విరాట్ కోహ్లీ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే తన లోపాల కారణంగా తనపై తానే కొంచెం సంక్లిష్టతలను పెంచుకున్నాను అన్నారు. ప్రతీసారి సెంచరీ చేయడం కుదరదని ఆయన పేర్కొన్నారు. టీమ్ కు అసవరమయ్యే విధంగా పరుగుల చేసినా తనుకు సంతోషమే అని కోహ్లీ అన్నాడు. 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుంటూ అందరూ సెంచరీ గురించే ఆలోచిస్తారని ఆయన ఎదేవా చేశారు. తాను సెంచరీ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ స్కోర్ చేయగలనని కూడా తెలుసు.. ఏకధాటిగా ఐదారు సెషన్ల పాటు కూడా బ్యాటింగ్ చేయగలను అంటూ కోహ్లీ కామెంట్స్ చేశాడు.
Also Read : Venkatesh: ఛీఛీ.. నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావనుకోలేదు వెంకీమామ
కానీ ప్రతీసారి సెంచరీ చేయడం ఏ బ్యాటర్ కూ సాధ్యం కాదు.. కొన్నికొన్ని సార్లు అది కష్టం కూడా అని విరాట్ వెల్లడించాడు. తాను హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పట్నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి, ఇలా ప్రతీ ఒక్కరూ మాకు వంద పరుగులు కావాలి అంటారు.. బ్యాటింగ్ కు వెళ్లిన ప్రతీసారి ఇది మనసులో మెదులుతూనే ఉంటుంది ఈ సవాళ్లను ఎదుర్కొటూ చాలా కాలం పాటు ఆటలో కొనసాగడమే అందం అని విరాట్ కోహ్లీ చెప్పుబకొచ్చారు. కాగా రాహుల్ ద్రవిడ్ సైతం కోహ్లీ శతకంపై ప్రశంసలు కురిపించాడు. తాను హెడ్ కోచ్ గా నియిమతుడయ్యాక కోహ్లీ టెస్టులలో తొలి సెంచరీ చేశాడని.. అది చూడటం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని రాహుల్ ద్రవీడ్ చెప్పారు.