IND vs AUS Test: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs AUS, Saint Lucia Weather Forecast: సూపర్ 8 లో నేడు భారత్, ఆస్ట్రేలియా సెయింట్ లూసియాలో తలపడనున్నాయి. అక్కడ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అంటే, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) సూపర్ 8 రౌండ్‌లో జరగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టీంకు…
రాజ్ కోట్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మూడో వన్డే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. జట్టుకు ఆసీస్ ఓపెనర్లు శుభారంభం అందించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ దెబ్బకు ఎల్బీగా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో అష్టన్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తవ్వగా.. సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు.
టెస్టు సిరీస్ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పైనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో ఓడినా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.