Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 39 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈరోజు ఉదయం తన సహచర ఆటగాళ్లకు కూడా తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. అయితే, 2011లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఖ్వాజా, సిడ్నీలో జరగనున్న యాషెస్ టెస్ట్‌తో తన టెస్ట్ కెరీర్‌ను ముగించనున్నారు. ఇదే మ్యాచ్ అతనికి ఆస్ట్రేలియా తరఫున 88వ టెస్ట్ కానుంది.
Read Also: తక్కువ చార్జీలు, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్రభుత్వ కొత్త Bharat Taxi రైడ్–హైలింగ్ సేవ..!
అయితే, 2023లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కూడా ఖ్వాజా కీలక ఇన్సింగ్స్ ఆడాడు. పాకిస్తాన్‌లో జన్మించి ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా, అలాగే, ఆ దేశం తరఫున ఆడిన తొలి ముస్లిం క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అతను ఆస్ట్రేలియా తరఫున 49 వన్డేలు కూడా ఆడాడు. కాగా, ఇప్పటి వరకు ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌లో 8,000కిపైగా పరుగులు సాధించాడు. 87 టెస్టులు, 49 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ఆడిన అతను 2023 సంవత్సరానికి గానూ ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా అందుకున్నాడు.
Read Also: Akkineni Family : 2026లో అక్కినేని ఫ్యామిలీ నుండి డిఫరెంట్ జోనర్ మూవీస్
రిటైర్మెంట్ ప్రకటించిన ఖ్వాజా భావోద్వేగంగా మాట్లాడుతూ.. సిడ్నీ టెస్ట్ తర్వాత నేను అన్న విభాగాల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను.. క్రికెట్ ద్వారా దేవుడు నాకు ఊహించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు, ఆటకు మించిన స్నేహాలు, మైదానం వెలుపల నాకు నేను ఎవరో తెలుసుకునే పాఠాలు నేర్పించాడని అన్నారు. అలాగే, తన తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. హైలైట్ రీల్స్‌లో కనిపించని ఎన్నో త్యాగాలు చేసిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని ఖ్వాజా చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు రెండు గదుల ఇంట్లో ఉంటూ మా పేరెంట్స్ ఎంతో కష్టపడి మమ్మల్ని పోషించేవారు.. అప్పుడే నేను ఏదో ఒక రోజు టెస్ట్ క్రికెటర్ అవుతాను’ అని కలగన్నాను అని ఖ్వాజా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
Read Also: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తొలి టెస్టు మొదటి ఇన్సింగ్స్ లో ఉస్మాన్ ఖ్వాజా ఆడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌కు దిగలేకపోయాడు. వెన్నునొప్పి (బ్యాక్ స్పాజం) కారణంగా అతను జట్టుకు దూరమవడంతో, అతని స్థానంలో ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ ఛాన్స్ హెడ్‌కు కలిసి వచ్చింది. కీలక సమయంలో అతను ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించింది.
అయితే, ఉస్మాన్ ఖ్వాజా గాయాల సమస్య అక్కడితో ఆగలేదు.. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టుకు అతను పూర్తిగా దూరమయ్యాడు. మూడో టెస్ట్‌కు ముందు ఖ్వాజాను జట్టు నుంచి తప్పించే ఆలోచన కూడా సెలెక్టర్లు చేశారు. అడిలైడ్‌లో జరిగే మూడో టెస్టులో అతనికి అవకాశం దక్కదని దాదాపు ఖరారైన పరిస్థితి నెలకొంది. కానీ, మ్యాచ్‌కు ముందు చివరి క్షణంలో స్టీవ్ స్మిత్ గాయపడటంతో పరిస్థితి మారిపోయింది. దీంతో ఖ్వాజాను మళ్లీ జట్టులోకి తీసుకుని, ఈసారి ఓపెనర్‌గా కాకుండా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయమని టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. ఇలా అనుకోకుండా లభించిన అవకాశంతో అతడు మరోసారి జట్టుకు సేవలందించే అవకాశం లభించింది. గాయాలు, జట్టులో స్థానం మార్పుతో ఈ యాషెస్ సిరీస్ ఉస్మాన్ ఖ్వాజా కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.