IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు..…
IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించింది. అయితే, మరోవైపు భారత్‌కు 6 వికెట్లు లభించాయి కూడా. అయితే, నలుగురు బ్యాట్స్‌మెన్‌ల హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శామ్ కాన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా గట్టి ఆరంభాన్ని అందించారు. కొంటాస్ 60 పరుగుల ఇన్నింగ్స్, ఉస్మాన్ ఖవాజా 57…
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు కాసేపు ఆపేశారు. వర్షం కారణంగా దాదాపు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది.
ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు…
Usman Khawaja survives Injury from Shamar Joseph Bouncer: ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు కంకషన్ టెస్ట్ చేశాడు. అంతా బాగుండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.…
Australia need 174 more to win Ashes 2023 1st Test: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి టెస్ట్ గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇంగ్లండ్‌కు సమ అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టుకు ఇంకా 7 వికెట్స్ కావాలి. దాంతో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. చివరి రోజు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే…
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా ఒక్కసారిగా బయటకు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన బెన్ స్టోక్స్.. ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి మరీ ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.