Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్‌లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశతకాలతో చెలరేగడం వల్ల.. ఎస్ఆర్‌హెచ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్ (21 బంతుల్లో 28) అకీల్ హొసేన్ (10 బంతుల్లో 16) మెరుగ్గా రాణించారు.
Man Kills Minor Wife: దారుణం.. భార్య తల, మొండెం వేరు చేసి హత్య..

తొలుత టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడంతో రంగంలోకి దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ.. వచ్చీ రావడంతోనే మెరుపులు మెరిపించడం మొదలుపెట్టాడు. అవతల బౌలర్ ఎవరు? ఎలాంటి బంతులు వేస్తున్నారు? అనేది పట్టించుకోకుండా.. భారీ షాట్లతో ఎగబడ్డాడు. ఓవైపు మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠిలతో పాటు మార్క్రమ్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టినట్టే పెట్టి పెవిలియన్ బాట పడుతుంటే.. అతడు మాత్రం ఒంటరి పోరు కొనసాగించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టాపార్డర్ ఘోరంగా విఫలమైనా.. సన్‌రైజర్స్ స్కోరు పరుగులు పెట్టిందంటే, అది అభిషేక్ పుణ్యమే! ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతగాడు.. 12 ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 67 పరుగులు చేశాడు.
Miss Shetty Mr Polishetty Teaser: అనుష్క ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందట
అభిషేక్ ఔటయ్యాక ఇక ఎస్ఆర్‌హెచ్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో.. ఇంకా నేనున్నానంటూ క్లాసెన్ తన క్లాస్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. భారీ షాట్లతో మోత మోగించేశాడు. మెరుపు వేగంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్ల సహకారంతో అతడు 57 పరుగులు సాధించాడు. క్లాసెన్‌తో పాటు అబ్దుల్ సమద్ కూడా మెరుగ్గా రాణించాడు. వీళ్లిద్దరు ఆరో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. సమద్ తర్వాత చివర్లో వచ్చిన హొసేన్ కూడా పర్వాలేదనిపించాడు. 10 బంతులు ఎదుర్కొన్న అతడు.. ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి 16 పరుగులు చేశాడు. ఫలితంగా.. ఎస్‌ఆర్‌హెచ్ 197 పరుగులు చేయగలిగింది. మరి.. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!