Miss Shetty Mr Polishetty Teaser: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడును ఈ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేని ఒక అమ్మాయికి.. ఆమె కంటే చిన్న వయస్సులో ఉన్న అబ్బాయితో పరిచయం ఎలా అయ్యింది..? అది ప్రేకు దారి తీసిందా..? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Mrunal Thakur: ఈ రకంగా విప్పి చూపించేది.. అందుకేనా పాప
“ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు.. అది సైన్స్.. అంటూ తన దగ్గరపనిచేసే చెఫ్స్ కు చెప్తున్నా అనుష్క వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. ఇక నా కూతురు ఏమైనా సామాన్యురాలు అనుకుంటున్నావా .. ఎప్పటికీ పెళ్లి చేసుకోదు.. అంటూ అనుష్క తల్లి జయసుధ చెప్పడంతో ఆమెకు పెళ్లి మీద సదాభిప్రాయం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇటుపక్క ఇండియాలో డబ్బు కోసం స్టాండప్ చేసే కమెడియన్ గా సిద్దుగా నవీన్ ను పరిచయం చేశారు. చిన్నాచితకా షోలు చేస్తూ తండ్రి చేత తిట్లు తినే సిద్దు.. అనుకోకుండా చెఫ్ శెట్టి రెస్టారెంట్ లో చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి వారిద్దరి మధ్య పరిచయం.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కథగా తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే నవీన్ తన కామెడీతో మెప్పించాడు. ఆయనకు తగ్గట్టే పంచ్ లతో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాడు. ఇక అనుష్క కొద్దిగా బొద్దుగా ఉన్నా.. అందంగా కనిపించింది. స్వీటీ పక్కన నవీన్ కొద్దిగా చిన్నవాడిలానే కనిపించదు. అయితే కథ కూడా అలాంటిదే కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యినట్లు కనిపిస్తున్నారు. రాధాన్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీల్ ను ఇస్తోంది. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై హైప్ తెచ్చేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.