టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అభిషేక్ గొప్ప ప్లేయర్ అని.. చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడన్నాడు. అభిషేక్ మ్యాచ్ విన్నర్ అని, టీ20 సిరీస్‌లో అతడి వికెట్‌కు తమకు చాలా కీలకమైనదని తెలిపాడు. ఆరంభ ఓవర్లలోనే అభిషేక్ వికెట్ తీస్తే టీమిండియా పరుగుల వేగాన్ని ఆపొచ్చని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది.…
2025 కాలగర్భంలో కలిసిపోయేందుకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల లిస్ట్ ను గూగుల్ విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ఓ లిస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ జాబితా చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సంవత్సరం పాకిస్తాన్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి బాబర్ ఆజం లేదా షాహీన్ షా అఫ్రిది కాదు, అతను ఓ…
భారత ఓపెనింగ్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్, సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2025-26 మ్యాచ్‌లలో భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా…
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
IND vs AUS: మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 13.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 40 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ముందడుగు వేసింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన…
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు. టాస్ గెలిస్తే ముందుగా…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్‌మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో…
భారత స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బెన్నెట్ లతో కలిసి సెప్టెంబర్ 2025 సంవత్సరానికి ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు గత నెలలో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. భారతదేశం తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్లో అభిషేక్, కుల్దీప్ కీలక పాత్ర పోషించారు. బెన్నెట్ అద్భుతమైన బ్యాటింగ్ జింబాబ్వే 2026 T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర…
Brian Lara: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు వన్డే ఫార్మాట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇంకా జట్టులో ఉన్నప్పటికీ, త్వరలోనే అభిషేక్ కూడా ఆ జట్టులో స్థానం సంపాదించే అవకాశముందని…
Abhishek Sharma: 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ తన శిష్యుడు అభిషేక్ శర్మ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. యువరాజ్ సింగ్ శిక్షణలో శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా తన బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎలా మెరుగుపరుచుకున్నాడో అభిషేక్ శర్మ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో యువరాజ్ శిక్షణ అభిషేక్‌కు ఎంతగానో ఉపయోగపడిందని అందులో చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే…