Team India New Captain: ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎన్నికపై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తు కొనసాగిస్తుంది. కెప్టెన్ రేసులో మొదటి నుంచి శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జూన్ 20వ తేదీన ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టూర్‌తో భారత టెస్టు జట్టు నూతన సారథి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా కొత్త కెప్టెన్ పేరూ ఖరారు కాలేదు.
Read Also: Mahesh Goud : జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
అయితే, కెప్టెన్ రేసులో మొదటి వరుసలో ఉన్న శుభ్‌మన్ గిల్ టమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘంగా భేటీ అయినట్లు సమాచారం. అలాగే, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా మే 6వ తేదీన వాంఖడే స్టేడియంలో గిల్‌తో మాట్లాడినట్లు తెలుస్తుంది. కాగా, తాజా సమాచారం ప్రకారం శుభ్‌మన్ గిల్‌ను టీమిండియా భవిష్యత్త్ కెప్టెన్‌గా బీసీసీఐ చూస్తోంది. అతడు ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను సారథిగా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అలాగే, బ్యాటర్‌గానూ మంచిగా రాణిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గిల్ కు జట్టు పగ్గాలు అప్పగించడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.
Read Also: India-Pakistan: పాకిస్థాన్‌పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
ఇక, మరి కొందరు టీమిండియా మాజీ దిగ్గజాలు మాత్రం బుమ్రా వైపు చూస్తున్నారు. అయితే, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం సీనియర్ ప్లేయరైన రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందనే తన అభిప్రాయమూ తెలియజేశాడు. ఏది ఏమైనప్పటికీ భారత నూతన టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ మరికొన్ని రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉంది. అధికారికంగా బీసీసీఐ ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.