ఐపీఎల్ 2024 మెగా టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుంది. మార్చి 21న మొదలైన ఐపీఎల్.. ఇప్పటికీ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకోగా.. 10వ మ్యాచ్ జరుగుతుంది. ఇక.. ఈ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లోనూ ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా.. ఇప్పటివరకు సన్ రైజర్స్ ప్లేయర్లు అత్యధిక సిక్సులు బాదారు. కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో క్లాసెన్ సిక్స్ ల మీద సిక్స్ లు బాదాడు. అటు కేకేఆర్ బ్యాటర్ రస్సెల్ కూడా సిక్సర్ల సునామీ కురిపించాడు.
Read Also: Coffee With Youth: ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడ..
కాగా.. ఇప్పటివరకు అత్యధికంగా సన్ రైజర్స్ ఆటగాళ్లు క్లాసెన్ 2 మ్యాచ్ లలో కలిపి 15 సిక్సులు బాదాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 9 సిక్స్ లు కొట్టాడు. ఆ తర్వాత.. రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ 2 మ్యాచ్ ల్లో కలిపి 9 సిక్సులు కొట్టాడు. కేకేఆర్ బ్యాటర్ రస్సెల్ ఒక్క మ్యాచ్ లో 7 సిక్స్ లు, ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ 2 మ్యాచ్ ల్లో కలిపి 7 సిక్సులు కొట్టాడు.
Read Also: Laila: ‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. ఇదెక్కడి ట్విస్ట్ బాసూ?
కేవలం 9 మ్యాచ్ ల్లోనే సిక్సుల సునామీ చూపించారంటే.. ఈ సీజన్ లో ఇంకెన్ని సిక్స్ లు నమోదవుతాయో చూడాలి. మొత్తం 74 మ్యాచ్ లు ఉండగా, కేవలం 9 మ్యాచ్ లు జరిగాయి. ఈసారి సిక్స్ ల సంఖ్య వేలు దాటేలా అనిపిస్తుంది.