IPL 2024 CSK Playoffs Scenario: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. గుజరాత్‌పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి.. మూడో స్థానానికి చేరుకుంటుంది.
ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ మాత్రమే చెన్నైకి ఇప్పుడు తేలికైన ప్రత్యర్థి అని చెప్పాలి. చెన్నై మిగతా మూడు మ్యాచుల్లో గుజరాత్ సహా రాజస్థాన్, బెంగళూరుతో తలపడాల్సి ఉంది. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతుంతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, రాజస్థాన్‌లపై విజయం అంత సులువేమీ కాదు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న గుజరాత్‌ను ఓడిస్తే.. మిగతా రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా సరిపోతుంది.
Also Read: Virat Kohli: ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే బాగుండేది: విరాట్ కోహ్లీ
మరోవైపు చెన్నైపై గుజరాత్ గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎదుకంటే ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన గుజరాత్.. 4 విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండవు. కాకపోతే చెన్నైపై గెలిస్తే అధికారికంగా ఎలిమినేట్ కాకుండా ఉండడమే కాకూండా.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు చెన్నై, గుజరాత్ జట్లు ఆరు మ్యాచుల్లో తలపడగా.. చెరో మూడు విజయాలు సాధించాయి.