Virat Kohli Says For me it’s still quality over quantity: వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే.. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది కాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని, చాలా వెనుకబడిపోయాం అని అన్నాడు. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా.. ఆత్మగౌరవం కోసం ఆడతాం అని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింతా చేతుల మీదుగా విరాట్ అవార్డును అందుకున్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా ఐపీఎల్ 2024లో తన స్ట్రైక్‌రేట్‌పై వచ్చిన విమర్శలకు మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ‘నా వరకు క్రికెట్‌లో ఎప్పుడూ క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్ముతా. గేమ్ పరిస్థితి అంచనా వేస్తూ ఆడాలి. అందుకు పెద్దగా ప్రాక్టీస్ అవసరం లేదు. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్‌లను ఎన్నో ఆడా. ఇప్పటికీ నా ఆట మెరుగుకావడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ’ అని కోహ్లీ అన్నాడు.
Also Read: Virat Kohli-Preity Zinta: ‘కింగ్’ను ఎవరైనా ఇష్టపడాల్సిందే.. విరాట్ కోహ్లీ-ప్రీతి జింతా ఫోటో వైరల్!
‘స్పిన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ఆడితే.. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలుంటుంది. ఇందుకు పెద్దగా ప్రాక్టీస్ చేయలేదు. నాకు పూర్తి అవగాహన ఉంది. కొన్నిసార్లు రిస్క్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. అలా ఆడాలంటే నమ్మకం ఉండాలి. నా స్ట్రైక్‌రేట్‌ను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. ఈ సీజన్ ఆరంభంలో మేం అనుకున్న ఫలితాలు రాలేదు. చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు పాయింట్ల పట్టికను చూడకుండా ఆత్మగౌరవం కోసం ఆడతాం. ఫాన్స్ గర్వపడేలా చేయడానికి ప్రయత్నిస్తాం. వరుసగా విజయాలను సాధించడం ఇంకాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండేవి’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.