DC vs RR : ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఉత్కంఠను అందించింది. రెండు జట్లు సమానంగా 188 పరుగులు చేసి స్కోరులో టై అయిన వేళ, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇది 2021 తర్వాత ఐపీఎల్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. ప్రధాన ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188…
LSG Vs KKR: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారీ స్కోరు చేసినప్పటికీ, చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా, బ్యాటర్ల విధ్వసంతో 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238…
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్‌ను గురువు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు.