రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎంతో అనుభవం గల నటుడు స్టార్ క్రికెట్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్నర్ కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Hyderabad: బెట్టింగ్‌కి యువకుడు బలి.. తన కొడుకును టార్చర్ చేశారన్న తల్లిదండ్రులు..
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికి నమస్కారం. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో డేవిడ్ వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. ఈవెంట్ కంటే ముందు అంతా కలిసే ఉన్నాం. ఎంతో సరదాగా గడిపాము. నితిన్ ను, వార్నర్ ను మీరంతా నా పిల్లల్లాంటి వారు అని అన్నాను. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. ఐలవ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్.. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్.
Also Read:Ram Charan : బర్త్ డే ట్రీట్ RC 16 గ్లిమ్స్ ఉందా.. లేదా..?
ఆ తర్వాత నువ్ యాక్టింగ్ చేస్తున్నావు కదా యాక్టింగ్ లోకి రా నీ సంగతి చెప్తాను అన్నాను..అతను అన్నాడు మీరు క్రికెట్ లోకి రండి మీ సంగతి చెప్తానన్నాడు.. ఇలా చాలా అల్లరి చేశాము. ఏది ఏమైనా తెలియకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటే మీ అందరికి సారీ చెప్తున్నాను. ఇక ముందు జరగదు.. జరగకుండా చూసుకుందాం. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా అందరు చూడాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. నితిన్, శ్రీలీల హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాను ‘పుష్ప2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.