ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. తన స్టైల్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2020 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అప్పటి నుంచి కాస్త ఆచితూచి మాట్లాడుతున్న సునీల్ గవాస్కర్, ఐపీఎల్ లో ఏ టీమ్ తరుపున ఆడతారు అని అడిగిన ప్రశ్నకు తన స్టైల్ లో గవాస్కర్ ఆన్సర్ ఇచ్చారు.
Also Read : Viral Video: ట్రైన్ లో భర్త చేస్తున్న పని.. సీక్రెట్ గా వీడియో తీసిన ప్రయాణికుడు
నేను ముంబై వాడిని కాబట్టి కుదిరితే ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇష్టపడతా.. అది కుదరకపోతే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతాను.. ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. చెన్నై ఫ్రాంఛైజీ యజమానులు, క్రికెట్ ని ఎంతో ప్రేమిస్తారు. టీమ్ లోని ప్లేయర్లను ఎంతో గౌరవం ఇస్తారు అని సన్నీ పేర్కొన్నాడు. ఆ టీమ్ ప్లేయర్లతో నడుచుకునే విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు.
Also Read : Rayapati Sambasiva Rao: నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు..! కానీ.. రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు, మేనేజ్మెంట్ క్రికెట్ కి ఎంతో సేవ చేశారు.. శ్రీనివాసన్.. క్రికెట్ కి ఎనలేని బాధ్యతలు అందించారని గుర్తు చేశారు. ఇక రెండో కారణం మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోవచ్చు.. అతను టీమ్ ని ఎలా కెప్టెన్సీ చేస్తాడో తెలుసుకోవచ్చు.. అతను ఫీల్డ్ లో ఉన్నట్టే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు.. అందుకే సీఎస్కే తరపున ఆడాలనుకుంటా అని సునీల్ గవాస్కర్ అన్నారు.
