Viral Video: ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని వీడియోలు, ఫోటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు. చూస్తూనే ఉంటాం. అవి రెండూ మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను తాకుతాయి. కాబట్టి మీరు వాటిని ఎన్నిసార్లు చూశారో, మీరు వాటిని మళ్లీ చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వృద్ధ దంపతుల రైలు ప్రయాణం గురించిన వీడియో. ఇంతకుముందు కూడా వీరిద్దరూ కలిసి ఇలాంటి రైలు ప్రయాణాలు చేశారు. కానీ, ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు వీడియోలో ఏముంది? నెటిజన్లు అంత ఉద్వేగానికి లోనయ్యేది ఏమిటి? తెలుసుకుందాం.
Read also: TS EAMCET: ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ కట్
ఈ వీడియోను ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వృద్ధ దంపతుల రైలు ప్రయాణానికి సంబంధించిన ఈ వీడియోను అదే రైలులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను భర్త సపర్యలు చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఆమె అనారోగ్యంతో ఉంది అయితే అతను కూడా తనకుండా తన భర్యాకు చాలా ప్రేమతో తినిపిస్తున్నారు. ఆ తినిపిస్తున్న మరకలు తన పెదాలకు తగులుతుంటే తన చేత్తో తుడుస్తూ మళ్లీ ఆమెకు తినిపిస్తున్నాడు. అలా చేయడమే కాదు రాత్రి కూడా తన భార్యను చేయిపట్టుకుని టాయిలెట్‌కు తీసుకెళ్లి నిద్రపోయే వరకు పక్కనే కూర్చున్నాడు. తను పడుకున్నాక అప్పుడు భర్త కూడా సేదతీరాడంటూ ఈ వీడియో చిత్రీకరించిన ప్రయాణికుడు తెలిపాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వయసులో కూడా వృద్ధ జంట ప్రేమలో మునిగితేలడం చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ‘ఇది నిజమైన ప్రేమ కదా?’ ‘ఈ వయసులో ఇలాంటి ప్రేమ చాలా బాగుంటుంది. కానీ, ఇది సహనానికి పరీక్ష. దాన్ని అందుకోవడం అంత సులువు కాదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘ప్రేమ అంటే ఇవ్వడం. మన వైపు నుంచి భక్తిలా ఉండాలి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఏదేమైనా సరే ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండదు. కానీ తనను నమ్మకుని ఏడు అడుగులు వేసిన తన భార్యకు ఇంతగా సేవచేస్తున్న తన భర్తపై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.