IND Vs BAN: ఇటీవల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఢాకా వేదికగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.
కాగా బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా చెప్పాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉందని చెప్పాడు. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబ్, ముష్ఫీకర్ లాంటి ఆటగాళ్లతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తుందని ఆకాష్ చోప్రా తెలిపాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాదత్ హుస్సేన్, నాసుమ్ అహ్మద్‌తో వాళ్ల బౌలింగ్ కూడా బాగుందన్నాడు. మరి తొలి వన్డేలో ఏ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా, నజ్ముల్ హుస్సేన్ శాంటో, హసన్ సోహన్