Telangana Congress: డి.శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కాంగ్రెస్ లోకి చేరునున్నారు. దీనిపై ఆయన తండి డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇవాల ఆదివారంనాడు గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాగా.. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే దీంతో.. ధర్మపురి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. కాగా.. సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనేలా కాంగ్రెస్ పార్టీ నేతలను ఒప్పించగలిగారు. ఇక.. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ చేరికకు కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు కూడా అంగీకరించారు. ఇక..మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి శ్రీనివాస్ కూడా చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ డి.శ్రీనివాస్ గాంధీ భవన్ కు వెళ్లనున్నారు.
Read also: Attack : భార్యను కొడుతున్న భర్త.. మధ్యలో వచ్చిన అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో నంబర్ 2 నాయకుడు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా డీఎస్‌కు పేరుంది. డీఎస్‌కు తృటిలో సీఎం కుర్చీ తప్పిందని జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రస్తావించేవారు. స్వయానా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం ఫోన్ ఉంటేనే రాజకీయాలు చక్కదిద్దడంలో దిట్ట అని డీఎస్ ను పొగిడిన సందర్భాలున్నాయి. సమైక్య రాష్ట్రంలో డీఎస్ రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీఎస్ తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హస్తం పార్టీ కూడా డీఎస్‌కు ఆ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, 2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీఎస్ బీఆర్‌ఎస్‌లో చేరి ఆ తర్వాత రాజ్యసభ పదవిని పొందారు. ఆ తర్వాత బీఆర్ ఎస్ లో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం డీఎస్ రాజ్యసభ పదవీకాలం కూడా ముగిసింది. తనకు రాజకీయ జీవితాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం కొనసాగించాలని డీఎస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు డైలమాలో ఉన్న డీఎస్.. గతంలో సోనియా గాంధీని కలవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. డీఎస్ సొంతగూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో డీఎస్ కుమారుడు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనే వార్తకు ఇవాల్టితో పుల్‌స్టాప్ పెట్టారు. కాంగ్రెస్‌లోకి తన కుమారుడు చేరబోతున్నానేది డీఎస్ క్లారిటీ ఇచ్చారు.
Rajahmundry Incident: గొంతు నులిమి… టీడీపీ నేతపై అర్థరాత్రి దుండగుల దుశ్చర్య