IND vs SL, 2nd T20I Match: పూణే వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టీ20 మ్యాచులో భారత్ బౌలర్లకు చుక్కులు చూపించారు శ్రీలంక బ్యాటర్లు. మూడు టీ 20 సిరీస్ లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య రెండో టీ 20 జరుగుతోంది. కెప్టెన్ దాసున్ శనక, కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీలో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముఖ్యంగా శనక కేవలం 22 బాల్స్ లోనే 56 పరుగులు చేశాడు. కుశాల్ మెండిస్ 31 బాల్స్ లో 52 పరుగులు చేశాడు. ఇండియా ముందు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
Read Also: Varasudu: ఏం గురూ.. గౌతమ్ SSC ని తిప్పి తిప్పి చూపిస్తే గుర్తుపట్టలేమా..?
భారత బౌలర్లు నోబాల్స్ ఎక్కువగా వేయడంతో శ్రీలంక పరుగులు సాధించడం ఈజీగా మారింది. అర్ష్‌దీప్ సింగ్ ఐదు నో బంతులు వేసి రెండు ఓవర్లలో 37 పరుగులు ఇవ్వగా, ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మూడు వికెట్లు తీశాడు. ఇక శివమ్ మావి 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. మిగతా శ్రీలంక బ్యాటర్లు కూడా హిట్టింగ్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఓపెనర్ నిస్సంకా 35 బాల్స్ లో 33 రన్స్ చేశాడు. అసలంక 19 బాల్స్ లో 37 రన్స్ చేసి ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇదిలా ఉంటే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తడబడుతోంది. కేవలం 26 పరుగులకే 3 కీలక వికెట్లు పడ్డాయి. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి వెంటవెంటనే తక్కువ స్కోరుకు వెనుదిరిగారు.