Varasudu: ఏం గురూ.. గౌతమ్ SSC ని తిప్పి తిప్పి చూపిస్తే గుర్తుపట్టలేమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం వరిసు. తెలుగులో వారసుడు గా రిలీజ్ అవుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జనవరి 11 న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి నుంచి మహర్షి రీమేక్ అని, ఆ సినిమా లా ఉందని, ఈ సినిమాలా ఉందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఇది కొత్త కథని, ఒక కుటుంబ కథా చిత్రమని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవలే వారసుడు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ట్రైలర్ చూసిన తరువాత నెటిజన్లు.. ప్రిన్స్ సినిమాలో అనుదీప్ చెప్పిన డైలాగ్ ను వాడేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు చాలా వచ్చాయి.. కానీ, ఇదే మొదటిసారి అన్నట్లు చెప్పుకొస్తున్నారు.
Read Also: Ramya Raghupathi: నరేష్ ఒక నీచుడు.. రాఖీ కట్టిన అన్నతో నాకు ఎఫైర్ అంటగట్టాడు
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
వారసుడు ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఒక ఉమ్మడి కుటుంబం.. ముగ్గురు కొడుకులు.. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్.. అతడికి చిన్న కొడుకు అంటే పడదు. అతడు బయటికి వెళ్ళిపోతాడు. తండ్రి కంపెనీకి కష్టం రావడంతో మళ్లీ తిరిగివచ్చి ఆ కంపెనీని నిలబెడతాడు. కుటుంబాన్ని కలుపుతాడు. ఇప్పుడు ఈ కథను వింటుంటే కొన్నేళ్ల క్రితం వచ్చిన గౌతమ్ SSC అనే సినిమా కథ గుర్తుకు రావడంలేదా..? నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాజర్ తండ్రి.. ముగ్గురు కొడుకులు .. చిన్నవాడైన నవదీప్ జులాయి.. బయటికి వెళ్ళిపోతాడు.. మధ్యలో కుటుంబ సమస్యలు.. అన్నదమ్ములు విడిపోవడానికి ట్రైచేస్తారు. వారిని కలపడానికి నవదీప్ కష్టపడతాడు. తండ్రికి తెలియకుండా గొప్పవాడు అయ్యి తండ్రి వద్దకు వస్తాడు.. సీన్స్, నటీనటులు మార్పు మాత్రమే .. కథ మొత్తం సేమ్ టూ సేమ్ ఉంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ట్రైలర్ చూసినవారు..ఏం గురూ.. గౌతమ్ SSC ని తిప్పి తిప్పి చూపిస్తే గుర్తుపట్టలేమా..? అని కొందరు.. ఈ సినిమా కోసమేనా దిల్ రాజు అన్ని పోరాటాలు చేశాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు సినిమా మొత్తం చూస్తేనే కదా తెలిసేది.. ఎందుకు ముందే ఇలాంటి మాటలు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు