SA vs IND: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడుతున్న టీమ్ ఇండియా స్కోరు బోర్డుపై 202 పరుగులు చేయగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 141 పరుగులకే ఆలౌట్ అయింది.
IND vs SA T20: భారత్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తన జట్టును ప్రకటించింది. నవంబర్ 8 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్‌కు భారత జట్టు తన జట్టును ప్రకటించింది. భారత్ తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికా కూడా టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఐడెన్ మార్క్రామ్ ఆఫ్రికన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ నాలుగు మ్యాచ్‌లు ముగియగా.. చెరో రెండు విజయాలతో ఇరు జట్లు సిరీస్‌ని సమం చేశారు. ఇప్పుడు ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు జట్లకి ఇది తాడోపేడో మ్యాచ్! ఎవరు గెలుస్తారో, వారికే సిరీస్ దక్కుతుంది. మొదట్లో భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, దక్షిణాఫ్రికా సునాయాసంగా ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. తొలి మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ని…
తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత్ జట్టు.. ఈరోజు కటక్‌లో జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు రాత్రి జరగనున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచినా సఫారీలు ఫీల్డింగ్ ఎంచుకొని ,భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. గత గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్..…
సాధారణంగా ప్రతి ఒక్క ఆటగాడికీ ఒక ఫేవరేట్ క్రికెటర్ ఉంటారు. అందరూ దాదాపు బాగా పేరుగడించిన దిగ్గజాల పేర్లే చెప్తారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అందుకు భిన్నంగా ఆశ్చర్యపరిచాడు. తనకు సచిన్, కోహ్లీ లాంటి డ్యాషింగ్ ప్లేయర్లు ఇష్టమేనని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్.. ఫేవరేట్ ప్లేయర్ మాత్రం వసీమ్ జాఫర్ అని చెప్పుకొచ్చాడు. ‘‘అందరికీ తమకంటూ ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నాకూ ఉన్నారు. జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే నాకెంతో…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈమధ్యకాలంలో ఫామ్‌లో లేడన్న సంగతి అటుంచితే.. ఇప్పటివరకూ కెరీర్‌లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు. పాత రికార్డుల బూజు దులిపేసి, ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులెన్నో నమోదు చేశాడు. కేవలం మైదానంలోనే కాదండోయ్, సోషల్ మీడియాలోనూ ఇతనికి తిరుగులేదు. బ్యాట్‌తో రికార్డుల ఖాతాని ఎప్పట్నుంచి తెరిచాడో, అప్పట్నుంచే కోహ్లీకి నెట్టింట్లో ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌లో 200 మిలియన్ మార్క్‌ని దాటేశాడు. ఈ ఘనత…
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత తుది జట్టుని ప్రకటించడం వరకూ.. జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలో స్థానంపై కొంత వివాదమైతే నెలకొంది. అతడు అద్భుతంగా బౌలింగ్ వేస్తోన్నా, వేగంగా బంతులు విసురుతూ బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ఎందుకు భారత జట్టులో చోటివ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. మాజీలు సహా, పాకిస్థాన్ వాళ్లూ పెదవి విరిచారు. అనుభవం పేరుతో కావాలనే అతడ్ని జట్టులో తీసుకోవడం లేదని మండిపడ్డారు. చివరికి ఆ విమర్శలకి చెక్ పెడుతూ.. అతనికి…