కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంలో ఆలోచనలో పడింది. అయితే భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇండియాలో సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఐసీసీ ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహించగలదా… లేదా అనే విషయంపై నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షాలకు సూచించింది. ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ నాటికి భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఓ స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది బీసీసీఐ. ఈ ఈలోగా- అక్టోబర్ నాటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.