పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో అయోమయకర పరిస్థతి నెలకొంది. పీసీబీ ఒక్కో సిరీస్ కు ఒక్కో కోచ్ ను మారుస్తూ ఆటగాళ్లలో గందరగోళం సృష్టిస్తుంది. ఆ జట్టు ఆడిన గత సిరీస్ ( షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ) కోసమని అబ్దుల్ రెహ్మాన్ ను హెడ్ కోచ్ గా పీసీబీ నియమించింది. ఆ సిరీస్ పాక్ కు చేదు అనుభవం ( 1-2తో పాక్ సిరీస్ కోల్పోయింది ) ఎదురుకావడంతో రోజుల వ్యవధిలో మరో కోచ్ ను మార్చింది. స్వదేశంలో త్వరలో ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ కోసమని పాక్ క్రికెట్ న్యూజిలాండ్ కు చెందిన గ్రాంట్ బ్రాబ్ బర్న్ ను తాత్కాలిక హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ జట్టు ఏ టీమ్ తో అయితే సిరీస్ అడుతుందో.. ఆదే దేశానికి చెందిన వ్యక్తులను కోచ్ లుగా నియమించుకుంటుంది.
Also Read : Balka Suman: మోడీ, అమిత్ షా లకే కాదు..అరవింద్, బండి సంజయ్ లవి కూడా పేక్ డిగ్రీలే
గతంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ఆడినప్పుడు ఆ దేశ మాజీ కోచ్ ల సేవలను వినియోగించుకుంది. మిక్కీ ఆర్థర్ వైదొలిగాక చాలాకాలంగా రెగ్యూలర్ కోచ్ లేని పాక్.. స్వదేశీ మాజీలు సక్లయిన్ ముస్తాక్, మిస్బా ఉల్ హాక్, అబ్దుల్ రెహ్మాన్ లను ట్రై చేసి వదిలేసింది. కాగా న్యూజిలాండ్ సిరీస్ కోసమని గ్రాంట్ బ్రాడ్ బర్న్ ను తాత్కాలిక హెడ్ కోచ్ గా నియమించిన పీసీబీ.. అతనికే డిప్యూటీగా తాజా మాజీ కోచ్ అబ్దుల్ రెహ్మాన్ ను నియమించడం ఆసక్తికర అంశం. ఇలా చేయడం స్వదేశీ కోచ్ అయిన అబ్దుల్ రెహ్మాన్ ను అవమానించడమేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. బ్రాడ్ బర్న్ తో పాటు పీసీబీ ఆండ్రూ పుట్టిక్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది. ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కు బౌలింగ్ కోచ్ గా పని చేసిన ఉమర్ గుల్ ను కొనసాగించింది.
Also Read : MS Dhoni : ధోని అరుదైన రికార్డ్.. ఆ సిక్సర్ పడిన చోటునే విక్టరీ మెమోరియల్‌గా మార్చిన ఎంసీఎ