న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 8 నుంచి 15 వరకు 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ టీ20 సిరీస్ కోసం ఇటీవలే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత జట్టు కోచింగ్ బాధ్యతలను భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. లక్ష్మణ్ గతంలో కూడా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.…
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించినందుకు పురుషుల జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సస్పెండ్ చేసింది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ హతురుసింఘా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇటీవల భారత్‌తో జరిగిన అన్ని టెస్టులు, టీ20 సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. బీసీబీ (BCB) అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయించింది.
Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు. భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో జరిగిన టెస్టు సిరీస్‌కు కోచ్‌గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్‌గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్…
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా.. ఐపీఎల్ 2024 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని విడిచిపెట్టింది.
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది.
మాజీ క్రికెట్ దిగ్గజం, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గంభీర్తో బీసీసీఐ సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. గంభీర్తో 4 గంటలపాటు బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కి 3 సార్లు టైటిల్ అందించాడు గంభీర్. 2012, 2014లో గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు కేకేఆర్ కి టైటిల్ అందించి…
BCCI Receives 3000 Applications for Team India Head Coach Job: టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్ పదవి కోసం ఏకంగా 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో…
Ashish Nehra To Become India Head Coach After Rahul Dravid: బీసీసీఐతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల ఒప్పందం ప్రపంచకప్ 2023 అనంతరం ముగియనుంది. ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే.. మరోసారి ద్రవిడ్‌ని హెడ్ కోచ్ పదవిలో కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవేళ భారత్ టైటిల్ గెలువకుంటే.. ద్రవిడ్‌పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అండర్-19లో మాదిరి అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ది వాల్’ ఇప్పటివరకు తనదైన ముద్ర…
సౌరాష్ట్రకి చెందిన సితాంశు కోటక్.. ప్రస్తుతం భారత A జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఐర్లాండ్ టూర్‌లో టీమిండియాకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వెళ్తాడని వార్తలు వొచ్చాయి.. కానీ, లక్ష్మణ్ మాత్రం ఎన్‌సీఏలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట.
RCB confirms appointment of Andy Flower as head coach: ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ అండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్ కోచ్‌గా పని చేసిన సంజయ్ బంగర్ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు డైరక్టర్ ఆఫ్…