Delhi Capitals Scored 130 Runs Against Gujarat Titans: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అమన్ హకీమ్ ఖాన్ (51) అర్థశతకంతో రాణించడం.. అక్షర్ పటేల్ (27), రిపల్ పటేల్ (23) తమవంతు సహకారం అందించడంతో.. ఢిల్లీ అంత మాత్రం స్కోరు చేయగలిగింది. నిజానికి.. మొదట్లో ఢిల్లీ కేవలం 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం చూసి.. ఇక ఈ జట్టు 100 పరుగుల మార్క్‌ని అందుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో బరిలోకి దిగి.. అమన్ ఆపద్భాంధవుడిలా తన జట్టుని ఆదుకున్నాడు. అలాగే అక్షర్, రిపల్ సైతం తమ జట్టుకి గౌరవప్రదమైన స్కోరు తెచ్చిపెట్టడంలో కృషి చేశారు.
Ukraine War: “చెర్నోబిల్” వద్ద రేడియేషన్ బారిన పడిన రష్యా సైనికులు..
వాస్తవానికి.. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ తమపై విజయం సాధించింది కాబట్టి, ఈరోజు డీసీ ప్రతికారపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోతుందని అందరూ భావించారు. ఫిల్ సాల్ట్ కూడా గత మ్యాచ్‌లో పామ్‌లోకి వచ్చాడు కాబట్టి, అతడు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముచ్చెమటలు పట్టిస్తాడని అంచనా వేశారు. కానీ.. అతడు తొలి బంతికే ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత రన్ తీయడానికి వీలు లేకపోయినా.. రన్ తీయబోయి వార్నర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వెనువెంటనే మరో వికెట్లు పడ్డాయి. అప్పుడు క్రీజులోకి వచ్చిన అక్షర్, అమన్.. ఆచితూచి ఆడుతూ, తమ జట్టు స్కోరును మెల్లగా పెంచుకుంటూ పోయారు. ఓవర్లు ముగుస్తుండటంతో.. అక్షర్ జోరు పెంచాలనుకున్నాడు కానీ, ఆ జోరులోనే అనవసరమైన షాట్ కొట్టి ఔటయ్యాడు. అమన్ మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి, అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. రిపల్ పటేల్ కూడా మంచి ఆటతీరు కనబర్చాడు. ఈ ముగ్గురి పుణ్యమా అని.. తమ ఢిల్లీ స్కోరు 23/5 నుంచి 130/8 దాకా చేరింది.
Go First: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
ఇక గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. మహమ్మద్ షమీ ఢిల్లీ పతనాన్ని శాసించాడు. టాపార్డర్‌ని అతడు కుప్పకూల్చేశాడు. అతడు ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో అతను ఇచ్చింది కూడా కేవలం 11 పరుగులే. మోహిత్ శర్మ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి, రెండో వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే.. ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లోకి చేరాడు. ఇక రషీద్ ఖాన్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. గుజరాత్ జట్టు 131 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. ఇంత తక్కువ స్కోరుని డీసీ బౌలర్లు డిఫెండ్ చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!