Ukraine War: “చెర్నోబిల్” వద్ద రేడియేషన్ బారిన పడిన రష్యా సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ 1986లో పేలిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా మారింది.
చెర్నోబిల్ విపత్తు తరువాత, రసాయన నిపుణుల బృందాలు కలుషితమైన మట్టిని త్రవ్వి అక్కడి రెడ్ ఫారెస్ట్‌లో భూమి క్రింద పాతిపెట్టడానికి పెట్టారు. రెేడియేషన్ అక్కడి పరిసరాల్లోకి వ్యాపించడంతో అటువైపుగా జనాలు వెళ్లకుండా 37 ఏళ్లకుపైగా నిషేధం కొనసాగుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలోకి రష్యా సైన్యం చొచ్చుకు వెల్లింది. దాదాపుగా 5 వారాల పాటు చెర్నోబిల్ ఏరియాలోనే రష్యా సైనికులు ఉన్నారు. దీంతో వారు రేడియేషన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
Read Also: Go First: గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాళా.. 3 రోజలు పాటు ఫ్లైట్స్ బంద్..
అత్యంత విధ్వంసకమైన అణు ప్రమాదం..
1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత 1.23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పర్యవేక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ పేలుడు సంభవించింది. అణురియాక్టర్ లోని నాలుగో నంబర్ యూనిట్ లో విద్యుత్ సరఫరా ఆపేశారు. ఈ పనిచేయడానికి ముందే రియాక్టర్ సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు గుర్తించలేదు.
కరెంట్ నిలిచిపోవడంతో రియాక్టర్ కు నీటిని సఫ్లై చేసే టర్బైన్స్ ఆగిపోయాయి. ఫలితంగా రియాక్టర్లలో పీడన పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది. అప్పటికే రియాక్టర్ ని నిలిపేద్దాం అనుకున్నప్పటికీ ఆలస్యం జరిగిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా చెర్నోబిల్ ప్రాంతం నుంచి 2.34 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లారు. రేడియేషన్ వల్ల 47 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!