నేడు ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ ఆడనున్నారు. ఆ తర్వాత వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక జట్టులోకి జడేజాను తీసుకోవడంతో విహారి చోటు కోల్పోయాడు. మరో స్పిన్నర్‌గా అశ్విన్ అలాగే పేస్ విభాగంలో బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకు చోటు దక్కింది. దీంతో మహ్మద్ సిరాజ్ కు తుది జట్టులోకి చోటు దక్కలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. చూడాలి మరి ఇందులో ఏం జరుగుతుంది అనేది.
భారత జట్టు: రోహిత్ శర్మ, గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే (vc), రిషబ్ పంత్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.