Babar Azam Interesting Comments On ODI World Cup In India: ‘ఆసియా కప్’ వ్యవహారంలో భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే! పాక్‌లో ఆసియా కప్ జరిగితే భారత్ వెళ్లదని అప్పట్లో జైషా చేసిన వ్యాఖ్యలు.. ఇరు దేశాల మధ్య అగ్గి రాజేసింది. ఆసియా కప్ కోసం భారత్ రాకపోతే.. తాము వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాలో పాదం మోపమని పాక్ బోర్డు తిరిగి సమాధానం ఇచ్చింది. పాక్ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా అదే తరహాలోనే రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో.. వన్డే వరల్డ్‌కప్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారంటూ షాకిచ్చాడు.
Ileana: గోవా పాపకి సినిమాలు లేవు… సాంగ్స్ చేసుకుంటుంది…
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఒక ఛానెల్‌తో బాబర్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ మీద మేము దృష్టి సారించాం. ఈ మెగా టోర్నీలో మంచి ప్రదర్శన ఇవ్వాలని కృషి చేస్తున్నాం’’ అని తెలిపాడు. అలాగే.. ఓపెనింగ్‌లో రిజ్వాన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో తమది మంచి కాంబినేషన్ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రతిసారీ తమ కాంబో వర్కౌట్ అవ్వకపోవచ్చని, ఇద్దరు ఆటగాళ్లపైనే జట్టు ఆధారపడకూడదని అన్నాడు. జట్టును విజయతీరాలకు నడిపించేందుకు.. ఎంతోమంది ఆసక్తి ఉన్న ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని పేర్కొన్నాడు. ఈసారి తాము సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తామని విశ్వాసం వెలిబుచ్చాడు. ఇలా బాబర్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే.. వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ తప్పకుండా భారత్ వస్తుందని స్పష్టమవుతోంది.
Botsa Satyanarayana: ఊరికే చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలి.. చంద్రబాబుపై కౌంటర్