IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సగటు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో కనీసం 1,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ తర్వాత జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ 65.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు.
వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో మార్క్రామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచండాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించాడు.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్‌సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది.
మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు.