Botsa Satyanarayana Strong Counters On Chandrababu Naidu Over Global Summit: టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదని, చేసి చూపించాలని సవాల్ విసిరారు. విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు సమ్మిట్‌లు నిర్వహించారని, అయితే మరెవ్వరూ నిర్వహించనట్టుగా వాటి గురించి ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని అన్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం తన సమక్షంలో విశాఖలో చాలా క్రమశిక్షణగా సమ్మిట్ నిర్వహించారన్నారు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్‌గా వచ్చారని, హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. తన అధ్యక్షతనే కమిటీ వేసి, ఎంవోయూలపై నిరంతరం పర్యవేక్షిస్తామని సీఎం చెప్పారన్నారు. కేవలం ఎంవోయూలే ముఖ్యం కాదని, గ్రౌండింగ్ కూడా ముఖ్యమని జగన్ ఆలోచన అని చెప్పారు. ఇక 13వ తేదీన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు లక్షల డెబ్భై వేల మంది ఓటర్లు ఉన్నారని, ఒక్క పట్టణంలోనే 17 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్క బూత్‌కు 800 మంది ఉంటారన్నారు. రాజకీయ పార్టీలకు ఏ ఎన్నికలైనా ప్రతిష్టాత్మకమైనవేనని అన్నారు.
Sania Mirza Farewell Match: ముగిసిన ఫేర్‌వెల్ మ్యాచ్.. కంటతడి పెట్టిన సానియా
ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. వారం రోజులుగా శాసనమండలి అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ని గెలిపించుకోవడానికి తామంతా కలిసికట్టుగా పని చేస్తున్నామన్నారు. నిర్భయంగా తాము ప్రజల వద్దకు వెళ్లి అడగగలుతున్నామన్నారు. ఎన్నికలు వచ్చినా, లేకపోయినా నిరంతరంగా ప్రజల్లో ఉంటున్నామన్నారు. అశోక్ గజపతి రాజు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారని, కానీ వీరభద్రస్వామి ఎప్పుడూ ప్రజలలోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని చాలామంది విద్యావంతులుగా తయారయ్యారన్నారు. కేవలం పది హేను శాతం మాత్రమే వ్యతిరేకత కనిపిస్తోందని, దీనిని 36 మంది కలిసి పంచుకోవాలని అన్నారు. అందుకే.. అందరూ కలిసికట్టుగా పని చేసి, మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
Girl Suicide Letter: పెళ్లి చెడగొట్టారని.. యువతి సూసైడ్ నోట్ రాసి..