యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు వరుస విజయాలతో ముందుకు వెళ్లడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్యాట్ తో అద్భుతంగా అరణిస్తున్నాడు. ఇక నిన్న షార్జా వేదికగా స్కాట్‌లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన 25వ అర్ధ సెంచరీ చేసాడు. అలాగే ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డునుసమం చేశాడు. 2014లో శ్రీలంకలో జరిగిన ఎడిషన్ లో కోహ్లీ అత్యధికంగా 4 హాఫ్ సెంచరీలు చేయగా.. ఇప్పుడు బాబర్ కూడా ఈ ప్రపంచ కప్ లో 4 అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే టీ 20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. స్కాట్లాండ్ పై చేసిన అర్ధ శతకం బాబర్ 2021లో 19వది. అయితే కోహ్లీ 2016లో అత్యధికంగా 18 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు దానిని బాబర్ బ్రేక్ చేసాడు.