Delhi vs Andhra: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఢిల్లీ జట్టు ఆంధ్రపై భారీ విజయం సాధించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన గ్రూప్ D మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 74 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ టోర్నీలో మంచి ఆరంభాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో…
Virat Kohli Record: పరుగుల మిషన్, కింగ్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.. మరో అరుదైన రికార్డుకు కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.. విజయ్ హజారే ట్రోఫీకి ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.. రిషబ్ పంత్ కెప్టెన్సీలో అతను కనీసం రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడట.. ఇక్కడే సరికొత్త రికార్డు రేస్‌లోకి వచ్చాడు కింగ్.. అయితే విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ రికార్డు ఏమిటో తెలుసుకుందాం… ఇప్పటివరకు, విరాట్ కోహ్లీ..…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అవార్డు గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కింగ్ తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ ఇప్పటివరకు 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్‌లలో 900+ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటికే టెస్ట్, వన్డే క్రికెట్‌లో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న కింగ్.. తాజాగా టీ20 క్రికెట్‌లో కూడా 900+ రేటింగ్ పాయింట్స్ సాధించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ 909 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. 897 రేటింగ్ పాయింట్స్ నుంచి 909కి చేరుకున్నాడు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సహా టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరఫున 9 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 9000 పరుగుల…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్లో) చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదోసారి కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అత్యధిక సీజన్లలో…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన డీసీ.. మరో విజయంపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచిన ఆర్‌సీబీ.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు జోరు మీదుండడంతో మ్యాచ్ అభిమానులను అలరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మ్యాచ్‌లో…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులను పూర్తి చేశాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ కోహ్లీ అర్ధ శతకం(67; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో మెరవడంతో ఈ రికార్డు సొంతమైంది. 17 పరుగుల…
గత కొంత కాలంగా ఫామ్‌తో తంటాలు పడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51 సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో ఇది…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.