Viral Dog : కుక్కలు అత్యంత విశ్వాసమైన జంతువులు. అంతేకాకుండా తమ యజమానులకు అత్యంత నమ్మకంగా ఉంటాయి. దాంతో చాలా మంది కుక్కలను మచ్చిక చేసుకొని వాటిని తమ ఇంట్లో పెంచుకుంటుంటారు. వాటికి కావాల్సినవి అందిస్తూ ఎనలేని ప్రేమను కనబరుస్తుంటారు. కొందరైతే పెంపుడు కుక్కలను తమ పిల్లల్లాగే చూసుకుంటారు. ఈ క్రమంలో వాటికి తాము తినే ఫుడ్ ను సైతం పెడుతుంటారు. వాటికి చిన్న అనారోగ్యం కలిగినా తెగ హైరానా పడిపోతుంటారు. కుక్కలు కూడా వారిపై ప్రేమ చూపించే వారిపై తిరిగి అంతే ప్రేమను చూపిస్తాయి.
Read Also: Sister Dead Body On Bike : సూసైడ్ చేసుకున్న చెల్లె.. మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లిన అన్న
వారు కనపడక పోతే అవి కూడా ఉండలేవు. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన చిన్న యజమాని స్కూల్ కెళ్లి వచ్చేంత వరకు అతడి కోసం రోడ్డుపై ఎప్పడు వస్తాడా అంటూ ఎదురు చూస్తూ కూర్చొంది. తన యజమాని స్కూల్ బస్సు రాగానే ఆ పిల్లాడిని చూసి తోక ఊపుకుంటూ వెళ్లి అతడిని ముద్దాడింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఎక్కడో గుండెల్లో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. అందుకే లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. మీరు ఆ వీడియోను ఓ సారి చూసేయండి.