Sister Dead Body On Bike : సూసైడ్ చేసుకున్న చెల్లె.. మృతదేహాన్ని బండిపై తీసుకెళ్లిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sister Dead Body On Bike : పరీక్ష సరిగా రాయలేదని చెల్లెలు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఎలాగోలా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. తిరిగి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అన్న తన చెల్లెలి మృతదేహాన్ని బైక్ పై 10కిలోమీటర్లు తీసుకెళ్లిన మానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కౌశంబి జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో 17 ఏళ్ల నిరాషా దేవి ఇంటర్ పరీక్షలు సరిగ్గా రాయలేదు.. ఫలితాల్లో మార్కులు మంచిగా రావంటూ ఆందోళనకు గురైంది. ఆహారం తీసుకోవడం మానేసింది.. అంతేకాదు ఇంట్లో ఒంటిరిగా ఉన్న టైములో ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ట్రీట్మెంట్ నిమిత్తం మంజన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే నిరాషా చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
Read Also: 12Pages : 12పేజీల సూసైడ్ నోటు.. చదివితే షాకింగ్ విషయాలు
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
చెల్లెలు మృత దేహాన్ని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్స్ ఏర్పాటుచేయాలని హాస్పిటల్ సిబ్బందిని అన్న కుల్దీప్ కోరాడు. అరగంటకు పైగా ఎదురు చూసినా అంబులెన్స్ దొరక్కపోవడంతో మృతురాలి సోదరుడు ఆమె మృతదేహాన్ని బండి పైనే దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబీకులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు హాస్పిటల్ అధికారులతో తగువుకు దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంజ్‌పూర్ పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై దర్యాప్తుకు చేస్తామని.. దర్యాప్తు ఆధారంగా అధికారులపై తగిన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!