కామ్రేడ్ లు… క్లారిటీ తో ఉన్నారా… ?లేక కన్ఫ్యుజ్ అవుతున్నారా..? క్లారిటీ లేకపోవడంతోనే వరుస ఓటముల మూటగట్టుకుంటున్న కామ్రేడ్ లు…ఎక్కడ తప్పులో కాలు వేస్తున్నారు?
తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్ లు కునుకుపాట్లు పడుతున్నారు. ఒకప్పుడు రాజకీయం అంతా కామ్రేడ్ ల చుట్టూ తిరిగేది. కానీ ఇప్పుడు రాజకీయాల చుట్టూ కామ్రేడ్ లు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అటు సీపీఐ, ఇటు సీపీఎం రెండు పార్టీలు కూడా ఎవరితో కలిసి పని చేయాలనే క్లారిటీ లేకుండా పోతోందనేది ఓపెన్ టాక్.ప్రభుత్వం మీద ఆందోళనలు చేస్తారు… ఉప ఎన్నికలు వస్తె… ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. ఇలా చేయడం తో కామ్రేడ్ లు… మరింత ఇరకాటంలో పడుతున్నారు. అయితే కామ్రేడ్ ల లెక్క వేరయినా… జనం లెక్క మరోలా ఉంది.
తెలంగాణ ఉప ఎన్నికల్లో ఒకటి హుజూర్ నగర్… రెండోది నాగార్జున సాగర్..మూడోది… హుజూరాబాద్.. ఇలా వరుస ఎన్నికల్లో లెఫ్ట్ వ్యూహం ఒక్కో చోట ఒక్కోలా ఉంటూ వచ్చింది. హుజూర్ నగర్ లో అధికార టియ్యారెస్ కి మద్దతు ప్రకటించి… తర్వాత ఆర్టీసి కార్మికుల సమ్మె తో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇక నాగార్జున సాగర్ లో… సీపీఎం..సీపీఐ గులాబీ జెండాకు జై కొట్టాయి. ఒకే జిల్లాలో జరిగిన ఎన్నికల్లో రెండు విధానాలు అనుసరించాయి.
ఇప్పుడు హుజూరాబాద్ లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. సీపీఎం పార్టీ… బీజేపీ వ్యతిరేక విధానం అంటుంది… మొన్నటి వరకు కాంగ్రెస్ ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది.దీనివల్ల అధికార trs కి అనుకూలంగా ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే… తాజాగా… సీపీఎం తన వైఖరి లో మార్పు తెచ్చుకుందా అనే టాక్ కూడా మొదలైంది. అధికార trs… బీజేపీ పార్టీలకు వ్యతిరేక కామెంట్స్ చేస్తూ వస్తోంది. దీంతో పరోక్షంగా… కాంగ్రెస్ కి అనుకూల నినాదం ఎత్తుకుందని టాక్ వినిపిస్తోంది.
అటు సీపీఐ సంగతి చూస్తే, ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్స్ తో కలిసి cpi కూటమిలో చేరింది. కానీ సీపీఎం మాత్రం…అసలు కాంగ్రెస్ రి కూడా దగ్గరకు తీయాల్సిన అవసరం ఏముందని భావించింది. సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ని ఏర్పాటు చేసి ఎన్నికలకు పోయింది. కనీసం ఒకటి..అర గెలిచే సీట్లలో కూడా ఉనికి కూడా ప్రశ్నార్ధకం అయ్యింది. అయితే…ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అనుకూల వాయిస్ ఎత్తుకుందా అనే టాక్ మొదలైంది. ఇలా కామ్రేడ్..ల అంచనాలు..తలకిందులు అవుతూ వస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు ఆందోళనలో కలిసి పనిచేస్తాయి.. కానీ ఎన్నికల్లో కలహాలు నడుపుతాయి. ఇలా వరుసగా దెబ్బ తింటున్నా ఓ క్లారిటీకి మాత్రం రాలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కామ్రేడ్ ల దారి హుజురాబాద్ లో ఎటు వైపు ఉంటుందో మరి..!