Ameerkhan : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఊవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానికి నేడు మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ.. అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఇందులో దాహా పాత్రలో కనిపించబోతున్నాడు అమీర్ ఖాన్. ఫస్ట్ లుక్ చూస్తుంటే అతను గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్ లో మాసివ్ అనిపించుకుంటున్నాడు. ఈ పోస్టర్ లో అమీర్ చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్ లో మెరిసిపోతున్నాడు. అయితే అమీర్ ఖాన్ ఇందులో ఏదైనా విలన్ పాత్రలో నటిస్తున్నాడా అనే ప్రచారమే ఎక్కువగా నడుస్తోంది.
Read Also : Priyamani : నేను కాపీ కొట్టలేదు.. ప్రియమణి వివరణ..
ఇందులో చివరి నిముషంలో అమీర్ ఖాన్ కనిపించే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ మూవీలో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించి గూస్ బంప్స్ తెప్పించాడు. క్లైమాక్స్ లో ఊహించని అరాచక లుక్ లో కనిపించాడు సూర్య. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా ఇలాంటి పాత్రలో కనిపిస్తున్నాడా అనే ప్రచారం ఉంది. అమీర్ ఖాన్ కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఏదైనా పవర్ ఫుల్ రోల్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఇందులో నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. రజినీకాంత్ కూలీ పాత్రలో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి.
Read Also : Thammudu : మా అమ్మ ముందే సిగరెట్ తాగాను.. నటి షాకింగ్ కామెంట్స్..