Off The Record: ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా..? మంత్రుల శాఖల్లో ఓఎస్డీలదే ఇష్టారాజ్యమా..!
- ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా?..
- కొందరు మంత్రుల ఓఎస్డీలు, పీఎస్‌ల ఇష్టారాజ్యమైపోయిందా?..
- విచ్చలవిడి వసూళ్ళు, లెక్కలేనితనం?..
- కొందరు ఓఎస్డీలు మంత్రుల్ని సైతం లెక్క చేయడం లేదా?..
- ఒక మంత్రి ప్రైవేట్ అసిస్టెంట్ హోటల్ కేంద్రంగా సెటిల్‌మెంట్స్?..
- మరో శాఖలో మంత్రి కంటే ఓఎస్డీ హవానే నడుస్తోందా?..
- చేతిలో కీలక శాఖలున్నా ఓఎస్డీకే అప్పగించేశారా?..
- గతంలో డూప్లికేట్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన పేషీ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ… ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు… సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట. కొంత మంది మంత్రుల దగ్గర పని చేసే ఓఎస్డీలు, పీఎస్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది వాళ్ళందరి కంప్లయింట్. విచ్చలవిడి వసూళ్ళు, ఎవర్నీ లెక్కచేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం లాంటి రకరకాల అవలక్షణాలతో మంత్రుల పేషీలను భ్రష్టుపట్టిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సదరు ఓఎస్డీలు, పీఎస్‌లు కొన్ని సందర్భాల్లో మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం ఉంది. గవర్నమెంట్‌కు బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రధాన శాఖ గురించి అయితే… అసలు మాట్లాడుకో కూడదన్నట్టుగా ఉందట వ్యవహారం. సదరు మంత్రి గారికి ఒక ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారట. ఓ హోటల్ కేంద్రంగా ఆయనే సెటిల్ మెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
Also Read
అన్ని చోట్ల కాకున్నా… ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ శాఖల్లో ఈ రకమైన పరిస్థితి ఉందట. భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్ మెంట్స్ కావచ్చు… ఏవైనాసరే…. ఈ మంత్రి గారి ప్రైవేట్ సిబ్బంది, ఓఎస్డీ చక్కబెట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇంకో శాఖలో అయితే…. ఓఎస్డీదే ఇష్టారాజ్యంగా నడుస్తోందని అంటున్నారు. మంత్రికంటే ఎక్కువగా ఆయనే అంతా తానై నడిపించేస్తున్నట్టు సమాచారం. ఆ మంత్రి దగ్గర కీలక శాఖలున్నాయి. అయినాసరే…. మూల విరాట్‌కు ముసుగు కప్పేసి… ఉత్సవ విగ్రహమే మొత్తం నడిపించేస్తోందని అంటున్నారు. ఇక్కడ పెత్తనం మొత్తం ఓఎస్డీదేనట. ఇదే శాఖలో పని చేయడానికి గతంలో ఒకరికి డూప్లికేట్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించిన ఘనత ఈ పేషీ అధికారులది. కొంత మంది మంత్రులు రెప్రెజెంటేషన్ లెటర్స్ కూడా ఇవ్వట్లేదట. అందుకు బదులు వారి ఓఎస్డీలే తమ పేరుతో వివిధ శాఖల అధికారులకు రికమండ్ చేస్తూ లెటర్లు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో.. టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇదేంటోనని మాట్లాడుకుంటున్నాయి అధికార వర్గాలు. కనీసం ఆరేడుగురు మంత్రుల ఓఎస్డీల పరిస్థితి అత్యుత భయంకరంగా ఉందన్నది ఇంటర్నల్ టాక్. ఒక్కో సందర్భంలో వాళ్ళు తమ మంత్రులను కూడా డామినేట్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళలో ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
ఇక రాయలసీమకు చెందిన ఒక మంత్రి ప్రైవేట్‌గా మనుషులను పెట్టుకుని మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఆదాయం వచ్చే ఆ శాఖలో రకరకాల మార్గాల్లో సెటిల్మెంట్స్ జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి కొన్ని సందర్భాల్లో ఒక శాఖ మంత్రి ఇచ్చిన లెటర్‌ను మరో మంత్రి పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారట. సీఎం ఎంత చెప్పినా కొంత మంది మంత్రులు మారడం లేదని, కాస్త సాఫ్ట్ మినిస్టర్స్ ఉన్న చోట్ల ఓఎస్డీలు, పీఎస్‌లదే ఇష్టారాజ్యమైపోయిందని మాట్లాడుకుంటున్నారు ఏపీ సచివాలయంలో. అలా ఇష్టారాజ్యంగా ఉంటున్న అధికారుల లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉందని, వాళ్ళని మారుస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా… కార్యాచరణ మాత్రం లేదు. మొత్తంగా టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!