CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతత్వంలోని కూటమి సర్కార్.. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
పాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయంలో ఈనెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నాం అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
అమరావతిలో రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఎపీ సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాలు (GAD టవర్) నిర్మాణ పనులను ఎన్ సీసీ లిమిటెడ్.. రూ. 882.47 కోట్లకు దక్కించుకుంది.. సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది ఎన్ సీసీ లిమిటెడ్ సంస్థ.. ఇక, సచివాలయంలోని 1, 2, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ... ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు... సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్‌లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు.
మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్‌లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్‌లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
CM Chandrababu: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పని చేయాలని అధికారులకు సూచించారు.