Off The Record: ఏపీ బీజేపీ వైఖరి మారుతోందా అంటే…. లేటెస్ట్ వాయిస్ వింటుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా… పదవుల విషయంలో వాళ్లు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమం వేదికగా ఆ అసంతృప్తి బయటపడిందని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ…. తమను ఫైవ్ పర్సంట్ వాటాదారుగానే చూస్తున్నారని, ఆ కోణం మారి ప్రాధాన్యం పెంచాలన్నదే ఏపీ కాషాయ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో బలాబలాలు, వాటాల సంగతి పక్కన పెడితే…. కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని, తమ కేంద్ర పార్టీ పెద్దలు అందిస్తున్న సహకారాన్ని మర్చిపోకూడదంటూ గుర్తు చేస్తున్నారట. ఆ అసహనమే… తాజా మీటింగ్‌లో బయటపడి ఉండవచ్చంటున్నారు పరిశీలకులు. అసలు మేమే లేకపోతే ఏపీలో కూటమి ఉందా అనడం, మేం గెలిపించగలం, పడగొట్టగలం అంటూ కామెంట్స్ చేయడం చుట్టూనే తాజా చర్చ నడుస్తోంది.
Read Also: Crime: ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే.. ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ
పదవుల విషయంలో మాకేంటి అన్న వైఖరే… ఆ అసహనానికి కారణమై ఉండవచ్చంటున్నారు. ఇప్పటి వరకు దశల వారీగా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో… తమకు తీవ్ర అన్యాయం జరిగినట్టు ఫీలవుతున్నారట ఏపీ బీజేపీ లీడర్స్. ఎంతసేపూ… 5శాతం భాగస్వామిగా చూస్తూ… నామ మాత్రపు పదవులు ఇస్తూ… ఇచ్చేశాంగా అంటున్నారని, మిగతా విషయాలను కూడా పట్టించుకోవాలన్నది వాళ్ల డిమాండ్ అట. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు, సహకారం అందుతున్నాయంటే… ఇక్కడున్న సంబంధాలే కారణం అని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ వాటా ఇంతేనని అమడం కరెక్ట్ కాదన్నది బీజేపీ లీడర్స్ కంప్లయింట్. తొలి విడతలో 47 మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పదవులు ఇస్తే… అందులో బీజేపీకి రెండు దక్కాయి. సెకండ్ లిస్ట్‌లో 38ఇస్తే… అందులో కాషాయ పార్టీ వాటా ఒక్కటంటే ఒక్కటే. ఇక ఈసారి ఆ ఒక్కటి కూడా ఉంటుందా, ఉండదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ నేతల్లో. తాము కూడా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని, మా కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోకపోవడం ఏం ధర్మమని ప్రశ్నిస్తున్నారట కాషాయ నేతలు. దీంతో ఈ వ్యాఖ్యల ద్వారా ఏపీ బీజేపీ నేతలు కూటమి పెద్దన్నను బెదిరిస్తున్నారా? లేక సీరియస్ వ్యాఖ్యల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో.
Read Also: YS Jagan: వైఎస్ జగన్‌ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..
తాజాగా పార్టీ వేదిక మీది నుంచి బహిరంగంగా ప్రశ్నించడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందట. మరోవైపు ఈ వ్యాఖ్యల ప్రభావం కూటమి కట్టుబాట్ల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో కూటమి సర్కార్‌లో మా వాటా ఏంటని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రశ్నించడం వెనక వేరే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరీ హీనంగా చూడకుండా…. గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునే దిశగా ఇలాంటి వత్తిళ్ళు పెంచుతుండవచ్చంటున్నారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి తో పాటు, ఎంపీలు సి.ఎం.రమేష్, శ్రీనివాసవర్మ చేసిన కామెంట్స్ ప్రభావం గట్టిగానే ఉండవచ్చంటున్నారు. రాష్ట్ర మంత్రి కూటమి విజయం పై మాట్లాడినా, కొత్త అధ్యక్షుడు కూటమి ధర్మాన్ని పాటిస్తామని చెప్పినా… పదవుల విషయమై ఇతర నాయకుల ఆలోచనలో వచ్చిన మార్పును పరిగణనలోకి తీసుకోవాలని, ఇది అంత త్వరగా మాసిపోయేది కాదని అంటున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం కల్పించాలని ఏపీ బీజేపీలో డిమాండ్ పెరుగుతోంది. మొత్తం మీద షేర్ పేరుతో… నామ మాత్రంగా పదవులు ఇచ్చి తొక్కేయకుండా తగిన గుర్తింపు ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ కాషాయ నేతల మనోగతంగా తెలుస్తోంది.