రౌడీయిజం చేసేవాడు అదే రౌడీయిజంకు బలవుతాడు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్ కూకట్‌పల్లిలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి రౌడీయిజం తట్టుకోలేక అతడి ఫ్రెండ్సే అతన్ని చంపేశారు. ఈ కేసులు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా కలిసి తిరిగారు.. అంతే కాదు ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే. కానీ ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ అంతే తేడా..
ఇందులో సయ్యద్ షాహిద్ అనే యువకుడు ఉన్నాడు. అతని తండ్రి బోరబండలో పెద్ద రౌడీషీటర్. షాహిద్ తన స్నేహితులతో కలిసి బోరబండలో మామూళ్లు వసూళ్లు చేస్తుంటాడు. అంతే కాదు ముగ్గురు ఫ్రెండ్స్ ని చిన్న చూపు చూస్తాడు. దీంతో అతన్ని చంపేయాలని ముగ్గురు ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. అతన్ని చంపేస్తే ఏరియాలో పెత్తనం తమదే అవుతుందని భావించారు. పైగా ఫ్రెండ్ చనిపోతే ఏమవుతుంది.. మహా అయితే కేస్ అవుతుంది. జైలుకు వెళ్లి మళ్లీ వస్తాం. ఏరియా మాత్రం మనకే దక్కుతుందనే ప్లాన్ వేశారు..
పక్కా ప్లాన్ ప్రకారం.. మే 29న మరో ఫ్రెండ్ పవన్ బర్త్ డే పార్టీకి షాహిద్‌ను ఆహ్వానించారు. కూకట్‌పల్లిలోని ప్రకాష్ నగర్‌లో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు సాజిద్, మున్నా మద్యం తాగుతున్నట్టు నటించారు. షాహిద్‌కు కాస్తా ఎక్కువగా మద్యం తాగించారు. తర్వాత బీర్ బాటిల్‌తో మెడపై పొడిచారు. బండరాయితో తలపై మోదారు. షాహిద్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండుకి తరలించినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు… ఫ్రెండ్‌ను చంపేస్తే నేరస్తులవుతారు.. కానీ రౌడీయిజంలో లీడర్‌షిప్ ఎలా వస్తుంది..? ఇంత చిన్న లాజిక్ మిస్సయ్యారు అతని ఫ్రెండ్స్. ఐతే ఓవరాల్‌గా రౌడీయిజం చేస్తూ అందరినీ బెదిరించిన వ్యక్తి.. తన ఫ్రెండ్స్ చేతుల్లోనే బలైపోయాడు..
BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..