MP: 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేసిన రావత్
- 15 నిమిషాల్లో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేసిన రావత్
- మధ్యప్రదేశ్ రాజ్‌భవన్‌లో విచిత్రమైన పరిస్థితి
- విమర్శలు గుప్పించిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మినీ కేబినెట్ విస్తరణ జరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రాంనివాస్ రావత్‌కు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో రాజ్‌భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ మంగూభాయ్ సి పటేల్.. రావత్‌చే మంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే రావత్ ప్రమాణం చేసేటప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లు చదివారు. పొరపాటును గమనించి.. తిరిగి 15 నిమిషాల వ్యవధిలో మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇలా దేశ చరిత్రలో నిమిషాల వ్యవధిలో రెండు సార్లుగా మంత్రిగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: చారులతగా ఆకర్షిస్తున్న ఓజి హీరోయిన్
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి రావత్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. గతంలో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. తాజాగా మంత్రిగా ప్రమాణం చేశాక.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రావత్ రాజీనామా చేశారు. దీంతో విజయ్‌పూర్ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. కాంగ్రెస్ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతోనే అలకబూని రావత్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మరో 3 ఖాళీలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: NEET UG 2024: నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
బీజేపీ తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవనీష్ బుందేలా మండిపడ్డారు. సుపరిపాలన అంటూ బీజేపీ చెప్పుకోవడాన్ని ప్రశ్నించారు. సుపరిపాలన అని చెప్పుకునే మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఈరోజు ఇంత నిర్లక్ష్యం జరిగిందన్నారు. ఇలాంటి పొరపాటు దేశంలో మునుపెన్నడూ చూడలేదన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!