Gandeevadhari Arjuna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్పై గా వరుణ్ లుక్ హాలీవుడ్ హీరోను గుర్తుచేస్తుంది.
Renu Desai: ఆయనతో పవన్ మాజీ భార్య.. ఫ్యాన్ మూమెంట్ అంటూ పోస్ట్
చాలా గ్యాప్ తరువాత వరుణ్ తన కటౌట్ కు సరిపడా రోల్ లో కనిపించాడు. ఇక ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. నాజర్ మినిస్టర్ గా కనిపించాడు. ఏదో మిషన్ కోసం అర్జున్ పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మిషన్ కు సాక్షి వైద్య హెల్ప్ చేస్తున్నట్లు కనిపించింది. విలన్ వినయ్ రాయ్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేయగా.. దాన్ని అర్జున్ ఎలా తిప్పికొట్టాడు అనేది కథగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో వరుణ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఇక మిక్కీ జె మేయర్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.