అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని… ఏ రంగంలో మహిళలకు వివక్షత ఉండకూడదని చెప్పారు. ముందు భాగంలో నిలబడాలన్నదే మోడీ ఆలోచన అన్నారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా మోడీ ప్రభుత్వం నిలబడిందని.. ట్రిబుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలబడ్డ ఘనత మోడీ ప్రభుత్వానిది గుర్తు చేశారు.
READ MORE: Home Minister Anitha: మహిళలపై ఆధారపడి ప్రస్తుతం ప్రభుత్వాలు నడుస్తున్నాయి..
“అన్ని రంగాలలో మహిళలు నిలబడాలన్నదే మోడీ కల. మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో తీవ్రవాదం లేదు. హైదరాబాద్ తో పాటు అనేక నగరాలలో అనేక చోట్ల బాంబులు పేలాయి. మోడీ పాలన వల్ల దేశమంతా శాంతి ఏర్పడింది. ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా అయోధ్యలో రామాలయం నిర్మించిన ఘనత మోడీది. 2047 వరకు వికసిత భారత్ గా చేయలన్నదే మోడీ లక్ష్యం. వికసిత భారత్ లక్ష్యంలో మహిళలు కీలకం కావాలి. టాయిలెట్ లేని ఇల్లు ఉందకూడదనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ప్రతి ఇంట్లో ఉజ్వాల పథకం కింద ప్రతి మహిళకళు గ్యాస్ సిలిండర్ అందుతోంది. మహిళా దినోత్సవం నాడు మహిళలందరూ ప్రధాని మోడీని ఆశీర్వదించాలని కోరుతున్న. పొదుపు సంఘాలలో ప్రతి మహిళా ఉండాలి. పొదుపు సంఘాలకు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నారు. పొదుపు సంఘాలు మహిళలకు ప్రోత్సహం, ఐక్యత, ధైర్యం. కేంద్ర ప్రభుత్వం జన ఔషధ కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. జన ఔషధ కేంద్రాలలో తక్కువ ధరలకు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది.” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.