తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
Women's Day: మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ -శరద్ పవార్ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. మహిళలు అణచివేత మనస్తత్వం, అత్యాచార మనస్తత్వం, నిష్క్రియాత్మక శాంతిభద్రత ధోరణిని చంపాలనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ముంబైలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారాన్ని లేఖలో ఖడ్సే పేర్కొన్నారు.
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…
మహిళా దినోత్సవం.. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీ లో 15 వేల మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని, అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరం మార్చి 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది…
‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’ అన్నారో కవి. స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు అని అర్థం. నిజమే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, పిన్ని, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ ఇలా ప్రతి దశలోనూ ఎదుటివారి జీవితంలో తనదైన ముద్ర…
Ram Charan Heap Praise on Upasana: కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్ చరణ్ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన…
Amazon Launches Women’s Day Gifting Store: ‘మార్చి 8’ ప్రతి మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు, సహోద్యోగినులకు చాలామంది బహుమతులు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్‌ను ఆరంభించింది. అమెజాన్…
Google Doodle: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్.
మహిళల భద్రత, స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే నిజమైన మహిళా సాధికారత అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అందుకే అన్ని పథకాల కింద కుటుంబాల్లోని మహిళ పేరు మీద అధికశాతం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల భద్రత…