అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు.
Mann Ki Bath : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్. ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్.
Kishan Reddy: భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని పెంపొందించడానికి బీజేపీ చేపట్టిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించే గొప్ప పత్రిక అని పేర్కొన్నారు. అనేక దేశాలకు భారత…
డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు నిరంతర అభివృద్ధి కోసం ఆకాంక్షించే భారతదేశం తరపున ఒక ప్రధాన ప్రకటన అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతకుమించి, మన దేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాలను జరుపుకుంటున్నప్పుడు ఈ నిర్ణయం, ఈ చారిత్రాత్మక బిల్లు ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తుగా నిలుస్తుందన్నారు.
మహారాష్ట్రలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు, ప్రత్యేకంగా మరింత వెనుకబడిన జిల్లాలపై దృష్టి సారించేందుకు గానూ ప్రపంచ బ్యాంక్ 188.26 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది. ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం జిల్లాల్లో 188.28 మిలియన్ డాలర్లు మహారాష్ట్ర పటిష్ట సంస్థాగత సామర్థ్యాలు, జిల్లాల ప్రణాళిక, వృద్ధి వ్యూహాలకు మద్దతు ఇస్తాయని ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.