Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై…
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…