Illicit Affair: ఢిల్లీ ఉత్తమ్ నగర్ లోని ఓ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య తన మేనల్లుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయంలో పోలీసుల దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారం, అక్రమ సంబంధాలు, వాట్సాప్ చాట్స్ ఇవన్నీ కలిసి ఈ హత్య వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
ఉత్తమ్ నగర్‌లో నివసిస్తున్న కరణ్ దేవ్ అనే వ్యక్తి జూలై 13న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడి భార్య, ఆమె మేనల్లుడు కలిసి కరణ్‌ను హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారు ఈ హత్యను విద్యుదాఘాతం వల్ల జరిగిన ప్రమాదంగా చిత్రించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కరణ్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, వైద్యులు ఇది “కరెంట్ షాక్” వల్ల మృతిగా అనుమానించారు. కానీ ఉత్తమ్ నగర్ పోలీసులు, SHO ముకేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన విచారణలో అసలు నిజం బయటపడింది.
WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్.. 5 పరుగుల తేడాతో ఓటమి..!
కరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయకుండా చూడాలని ప్రయత్నించిన భార్య నడవడికతో, పోలీసులకు అనుమానం కలిగించింది. కానీ, పోలీసులు పోస్ట్‌మార్టం చేయించగా.. ఆయన శరీరంలో అధిక మొత్తంలో నిద్రమాత్రలు ఉన్నట్లు తేలింది. దీనితో పోలీసులు అనుమానం రావడంతో.. కరణ్ సోదరుడు కునాల్, తన మేనల్లుడి ఫోన్ పరిశీలించగా ఆయన భార్యతో ఉన్న వాట్సాప్ చాట్స్ బయటపడింది. వాటిలో కరణ్‌ను ఎలా హత్య చేయాలి..? మత్తు మందులు ఎలా ఇవ్వాలి..? అని పక్కా ప్లాన్ కనిపించింది. దీంతో పోలీసులకు మరింత సమాచారం లభించడంతో ఆమె ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
పోలీసుల దర్యాప్తులో కరణ్ భార్యకు తన మేనల్లుడితో చాలాకాలంగా అక్రమ సంబంధం ఉండటం స్పష్టమైంది. ఈ వ్యవహారం తెలుసుకున్న కరణ్‌ను ఆ ముగ్గురు మత్తు మందులు ఇచ్చి హత్య చేశారు. దీనితో నిందితులపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డ్స్, మెడికల్ రిపోర్టుల ఆధారంగా పూర్తి సాక్ష్యాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.