Off The Record: తెలంగాణలో గ్రామ సమరం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా…. తాము బలపరిచిన ఎంత మంది అభ్యర్థులు గెలిచారో లెక్కలు చూసుకుని బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. అయితే… ఈ రిజల్ట్స్‌ని బీఆర్‌ఎస్ ఓ కొత్త కోణంలో చూస్తోందట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన, మంచి ఫలితాలే వచ్చాయన్నది గులాబీ నేతల అభిప్రాయం. అధికార పార్టీకి వన్‌సైడెడ్‌గా ఉండాల్సిన ఫలితాల్లో తాము కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించామన్నది కారు పార్టీ ఫీలింగ్. అయితే……
OTR: పంచాయతీ ఎన్నికల ఫలితాలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుకు ముడి పడుతోందా? రిజల్ట్ సరిగా లేని చోట జిల్లా మంత్రుల మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నారా? రేపు కేబినెట్ మార్పు చేర్పులకు, దీనికి లింక్ ఉండబోతోందా? కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో?
Congress: రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్ స్థానాల్లో 30 శాతం…
Sarpach Sworn: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌ల ప్రమాణస్వీకార వేడుకల తేదీని ప్రభుత్వం మార్పు చేసింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం, ఇప్పుడు డిసెంబర్ 22వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవడానికి, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా తేదీని పొడిగించాలని…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు…
Telangana : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నప్పటికీ, పాలమూరు (నాగర్‌కర్నూల్) జిల్లాలోని ఆరు గ్రామాల్లో మాత్రం ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఈ గ్రామాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలను బహిష్కరిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజలు డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ఎన్నికలను బహిష్కరించారు. Taj Mahal Disappears in…
Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది.
Local Body Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ విడతలో మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల…
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగయగా.. ఒంటి గంట లోపు క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు ఎన్నికల అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి స్తాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.…
అసెంబ్లీ ఎన్నికలైనా.. మున్సిపల్ ఎన్నికలైనా.. గ్రామపంచాయతీ ఎన్నికలైనా.. ప్రలోభాల పర్వం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2-5 వేల వరకు కూడా ముట్టజెబుతారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇదే జరుగుతోంది. అయితే గెలుపు కోసం కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఊహించని విషయం మెదక్…