IND vs PAK: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడూ హైవోల్టేజ్, రసవత్తరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2024లోనూ ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరును క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించారు. ఇప్పుడు దుబాయ్ వేదికగా మరోసారి భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ టై అయితే ఏమవుతుంది? విజేతను ఎలా నిర్ణయిస్తారు? అనే సందేహాలకు సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం.
Read Also: IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఆడుతాడా?
దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమైనదే. పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను బలపర్చుకోవడానికి గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, భారత జట్టు విజయం సాధించి సెమీఫైనల్ సీటును ఖరారు చేసుకోవాలని చూస్తోంది. అయితే, మ్యాచ్ టై అయితే విజేతను ఎలానిర్ణయిస్తారన్న విషయానికి వస్తే.. ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) స్పష్టమైన నిబంధనలు పెట్టింది. మ్యాచ్ టై అయితే, విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను అనుసరించాలి. అదే సూపర్ ఓవర్ కూడా టై అయితే మరోసారి సూపర్ ఓవర్ ఆడించాలి. ఇలా విజేతను నిర్ణయించే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి. అయితే, ఎంతటి ప్రయత్నమైనా మ్యాచ్‌కు విజేతను నిర్ణయించలేకపోతే రెండు జట్లకు సమాన పాయింట్లు ఇవ్వబడతాయి.
2025 చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు టై అయితే కూడా అదే విధంగా సూపర్ ఓవర్ ద్వారా ఫలితం నిర్ణయిస్తారు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా జరగకపోతే, రిజర్వ్ డే నిబంధన అమల్లో ఉంటుంది. ముందుగా ఫలితాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, సాధ్యపడకపోతే మిగిలిన మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున కొనసాగిస్తారు. మ్యాచ్‌కు DLS (డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్) నిబంధన కూడా వర్తిస్తుంది. నాక్‌ఔట్ దశలో రెండో బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 25 ఓవర్లు ఆడితేనే DLS ద్వారా ఫలితం నిర్ణయించనున్నారు. కానీ, గ్రూప్ స్టేజ్‌లో ఇది 20 ఓవర్లకే పరిమితం.
మొత్తంగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అక్కడ కూడా టై అయితే మరోసారి సూపర్ ఓవర్ ఉంటుంది. నాక్‌ఔట్ దశలో వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగితే, రిజర్వ్ డేలో మ్యాచ్ పూర్తిచేయనున్నారు. ఈ నిబంధనల ప్రకారం, ఈ హైటెన్షన్ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది.